HEALTH CARDS

www.ehf.gov.in/

 

1. GO.NO. 159 MRB Enhanced up to Feb- 2015 Click Here
2. GO.NO. 150 List of Hospitals For EHS Click Here
3. GO.NO.134  Modified for EHS Click Here
4. GO.NO.135  Modified for EHS (Out Patient) Click Here
5. GO.NO. 174  Employee Health Scheme Click Here
6. GO.NO. 175 Employee Health Scheme Click Here
7. GO.NO. 176 Price list for EHS Click Here
8. GO.NO. 210 Recovery of EHS Click Here
9. EHS       Guidelines in Telugu Click Here
10. USER MANUAL   to Enroll the Health Cards Click Here

 

SLABS AS PRC 2010

1. 6700 - 20110
7520 - 22430   
 A Rs.90.00
2. 7740 - 23040
14860 - 39540
B Rs.90.00
3. 15280 - 40510
44740 - 55600
C Rs.120.00

 

HEALTH CARDS GUIDELINES IN TELUAU CLICK HERE

 

  • ఇహెచ్‌ఎస్‌ అంటే ఏమిటి?
    • రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు 'ది ఆంధ్ర ప్రదేశ్‌ ఇంటిగ్రేటెడ్‌ మెడికల్‌ అటెండెన్స్‌ రూల్స్‌, 1972' క్రింద ప్రస్తుతం వున్న మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ సిస్టమ్‌లో భాగంగా ఆరోగ్య శ్రీ ఆరోగ్య రక్షణ ట్రస్ట్‌ క్రింద నమోదయిన ఆసుపత్రుల నెట్‌వర్క్‌ ద్వారా నగదు రహిత చికిత్సలను అందించేందుకు ఉద్దేశించినది ఉద్యోగుల ఆరోగ్య పథకం. (ఎంప్లాయీస్‌ హెల్త్‌ స్కీమ్‌ - ఇహెచ్‌ఎస్‌). 5 డిసెంబర్‌ 2013వ తేదీన ప్రారంభించిన ఈ పథకాన్ని జి.ఓ. ఎంఎస్‌. నెంబర్‌ 134 హెచ్‌ఎం అండ్‌ ఎఫ్‌డబ్ల్యు (1.1) డిపార్ట్‌మెంట్‌, డేటెడ్‌ 29.10.2014 ప్రకారం మార్పులతో ఈ పథకం ప్రస్తుతం అమలు అవుతోంది.జాబితాలో పేర్కొన్న అన్ని రకాల చికిత్సలకు ఎంపానెల్డ్‌ నెట్‌వర్క్‌ ఆసుపత్రుల నుంచి నగదు లేని చికిత్సలను లబ్ధిదారులు పొందవచ్చు. మరింత సమాచారం కోసం www.ehf.gov.in వెబ్‌సైట్‌ను చూడవచ్చు.
  • ఎవరు అర్హులు?
    • ఎ)ఎఫ్‌ఆర్‌లో నిర్వచించిన అందరు రెగ్యులర్‌ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రొవిన్షియలైజ్డ్‌ వర్క్‌ ఛార్జ్‌డ్‌ ఉద్యోగులతో సహా
      బి) స్థానిక సంస్థల ప్రొవిన్షియలైజ్డ్‌ ఉద్యోగులు
      సి) అందరు సర్వీస్‌ పింఛనుదారులు
      డి)కుటుంబ పింఛనుదారులు
      ఇ) తిరిగి ఉద్యోగం పొందిన సర్వీసు పింఛనుదారులు
  • ఎవరు అర్హులు కాదు?
    • ఎ)సిజిహెచ్‌ఎస్‌, ఇఎస్‌ఐఎస్‌, రైల్వేలు, ఆర్‌టిసి, పోలీసు శాఖకు చెందిన ఆరోగ్య భద్రత, ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సయిజ్‌ శాఖకు చెందిన ఆరోగ్య సహాయతల వంటి ఇతర బీమా పథకాలు వర్తించే వారు
      బి) లా ఆఫీసర్స్‌ (అడ్వొకేట్‌ జనరల్‌, స్టేట్‌ ప్రాసిక్యూటర్స్‌, స్టేట్‌ కౌన్సెల్స్‌, ప్రభుత్వ ప్లీడర్లు, పబ్లిక్‌ ప్రొసిక్యూటర్లు
      సి) క్యాజువల్‌, దినసరి వేతనంపై పనిచేసే కార్మికులు
      డి) దత్తత తీసుకొన్న తల్లిదండ్రులు జీవించివుండగా, జన్మనిచ్చిన తల్లిదండ్రులు
      ఇ) AIS officers and AIS pensioners and
      జి) జ్యుడిషియల్‌ అధికారులు
  • కుటుంబ సభ్యులు అంటే ఎవరు?
    • ఎ) భార్య లేదా భర్త
      బి) పూర్తిగా ఆధారపడిన పిల్లలు (దత్తత తీసుకొన్న పిల్లలతో సహా)
      సి) పూర్తిగా ఆధారపడిన తల్లిదండ్రులు (దత్తత తీసుకొన్న లేదా జన్మనిచ్చిన తల్లిదండ్రులు; కాని ఇద్దరికీ కాదు)
      డి) సర్వీసు పింఛనుదారుల తరహాలోనే కుటుంబ పింఛనుదారులపై ఆధారపడిన వారు కూడ అర్హులు
  • ఆధారపడటం అంటే?
    • ఎ) తమ జీవనోపాధి కోసం పూర్తిగా ఉద్యోగిపై ఆధారపడిన తల్లిదండ్రులు
      బి) నిరుద్యోగులైన కుమార్తెల విషయంలో వారు అవివాహితులు లేదా వైధవ్యం పొందిన వారు లేదా విడాకులు తీసుకొన్న వారు లేదా వదిలిపెట్టబడిన వారు (వయస్సు పరిమితి ఆంక్షలు లేవు) అయి వుండాలి.
      సి) నిరుద్యోగులైన కుమారులు 25 సంవత్సరాల లోపు వయస్సు వారై వుండాలి
      డి) వికలాంగులైన పిల్లల విషయంలో ఆ వైకల్యం వారి ఉపాధికి అవరోధంగా వుండాలి.
  • న్యాయమూర్తులు, ప్రభుత్వ ప్లీడర్లు, స్టాండింగ్‌ కౌన్సెల్స్‌ అర్హులా?
    • కాదు, లా ఆఫీసర్లు, జ్యుడిషియల్‌ ఆఫీసర్లకు ఈ పథకం వర్తించదు.
  • ఉద్యోగి తల్లిదండ్రులకు ఆరోగ్యశ్రీ కార్డు వుంటే, వారు ఈ పథక ప్రయోజనాలకు అర్హులా?
    • ఆరోగ్య శ్రీ కార్డు (తెల్ల కార్డు)ను కేవలం బిపిఎల్‌ కుటుంబాలకు మాత్రమే ఇస్తారు. ఒకవేళ తల్లిదండ్రులు తమ జీవిక కోసం పూర్తిగా ప్రభుత్వ ఉద్యోగిపై ఆధారపడివుంటే, వారి తెల్ల రేషన్‌ కార్డును రద్దు చేసి, పేదలకు ఉద్దేశించిన ప్రయోజనాలను పొందుతున్నందుకు ఉద్యోగిపై క్రమశిక్షణా చర్యలను తీసుకొంటారు. తల్లిదండ్రులు స్వతంత్రంగా జీవిస్తూ, ఆరోగ్య శ్రీ కార్డు కలిగివుంటే వారికి అర్హత వుండదు. ఉద్యోగుల ఆరోగ్య పథకంలో వారిని ఉద్యోగి చేర్చకూడదు.
  • తెల్ల రేషన్‌ కార్డు కలిగిన ఉద్యోగి తల్లిదండ్రులను లబ్దిదారులుగా చేర్చివుండి, ఉద్యోగి వారి పేర్లను దరఖాస్తు నుంచి తొలగించాలంటే ఏం చేయాలి?
    • తెల్ల రేషన్‌ కార్డు కలిగిన తల్లిదండ్రులను లబ్దిదారులుగా చేర్చివున్నట్లయితే, ఆ ఉద్యోగి వారి పేర్లను తొలగించేందుకు ఇహెచ్‌ఎఫ్‌ పోర్టల్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. లేదా దరఖాస్తు నుంచి వారి పేర్లను తొలగించేందుకు సంబంధిత డిడిఓను సంప్రదించాలి.
  • ఉద్యోగి / పింఛనుదారుల అత్తమామలు అర్హులా?
    • కాదు. ఉద్యోగి / పింఛనుదారుల అత్తమామలు అర్హులు కాదు.
  • సవతి పిల్లలు ( స్టెప్‌ చిల్డ్రన్‌ ) ఇహెచ్‌ఎస్‌ సదుపాయానికి అర్హులా?
    • అవును. జి.ఓ. ఎంఎస్‌. నెం. 174, హెచ్‌ఎం అండ్‌ ఎఫ్‌డబ్ల్యు (ఎం2) డిపార్ట్‌మెంట్‌, తేదీ 01.11.2013 ప్రకారం స్టెప్‌ చిల్డ్రన్‌ ఇహెచ్‌ఎస్‌ ప్రయోజనాలకు అర్హులు.
  • దత్తత తీసుకున్న పిల్లలు లేదా దత్తత తీసుకొన్న తల్లిదండ్రులకు పథకం వర్తిస్తుందా?
    • అవును. దత్తత తీసుకొన్న తల్లిదండ్రులు లేదా జన్మనిచ్చిన తల్లిదండ్రులలో ఎవరో ఒకరికి మాత్రమే వర్తిస్తుంది కానీ అందరికీ కాదు. అదే విధంగా దత్తత తీసుకొన్న పిల్లలకు కూడ వర్తిస్తుంది.
  • నిరుద్యోగిగా వున్న కుమారుడు 25 సంవత్సరాల వయస్సు దాటిన తర్వాత కూడ ఉద్యోగిపై ఆధారపడి జీవిస్తుంటే, అతడు పథక ప్రయోజనాలకు అర్హుడా?
    • కాదు. కుమారుడికి 25 సంవత్సరాలు దాటిన పథక ప్రయోజనాలు పొందేందుకు అనర్హుడు అవుతాడు. ఉద్యోగి / పింఛనుదారుడిపై ఆధారపడిన కుమారుడు వికలాంగుడై, ఆ వైకల్యం అతడి ఉపాధికి అవరోధంగా వుంటే, పథక ప్రయోజనాలు అతడికి వర్తిస్తాయి. అయితే వైకల్య ధృవీకరణ పత్రాన్ని తప్పనిసరిగా సమర్పించాలి.
  • భార్యాభర్తల్లో ఒకరు ప్రభుత్వ ఉద్యోగిగా వుండి, వేరొకరు ప్రైవేటు లేదా ఇతర వైద్య బీమా పథకం క్రింద వుంటే, వారు అర్హులా?
    • అవును. కుటుంబ సభ్యులైన ఆమె / అతడిని పథక లబ్ధిదారుగా చేర్చవచ్చు. అయితే వారికి సిజిహెచ్‌ఎస్‌, ఇఎస్‌ఐఎస్‌, రైల్వే, ఆర్‌టిసి, ఆరోగ్య భద్రత, ఆరోగ్య సహాయత వర్తిస్తుంటే, ఇహెచ్‌ఎస్‌ ప్రయోజనాలను పొందటానికి వీలులేదు.
  • ఆరోగ్య భద్రత, ఆరోగ్య సహాయత పథకం వర్తించే ఉద్యోగులు ఇహెచ్‌ఎస్‌ క్రింద నమోదుకు అర్హులా?
    • కాదు. ఉద్యోగిగా అతడు / ఆమె కి ఇహెచ్‌ఎస్‌ వర్తించదు. అయితే పదవీ విరమణ తర్వాత సర్వీస్‌ పెన్షనర్లు, కుటుంబ పింఛనుదారులకు పథక ప్రయోజనాలు వర్తిస్తాయి.
  • రాష్ట్రం వెలుపల నివసిస్తున్న పింఛనుదారులకు పథక ప్రయోజనాలు వర్తిస్తాయా?
    • ఈ విషయంలో ప్రభుత్వ ఉత్తర్వులు ఇంకా వెలువడలేదు.
 
HEALTH CARDS:
**కొందరు ఉద్యోగులు వారి ఫోటోలను మరియు వారిపై ఆధారపడిన కుటుంబసబ్యుల ఫోటోలను అప్ లోడ్ చేయని విషయం గమనించడమైనది. 

   అటువంటి ఉద్యోగులు

**www.ehf.gov.in అనే వెబ్ పోర్టల్ ద్వారా లాగిన్ అయ్యి తమ employee ID .ని మొదటిసారి పాస్ వర్డ్ గా ఫోటోలను అప్లోడ్ చేసుకోవచ్చును

**ఈ ప్రక్రియలో ఉద్యోగులు, తమపై ఆధారపడిన కుటుంబ సభ్యుల వివరాలను కూడా అప్ డేట్ చేసే వీలు కలదు.

**ఆధారపడిన సభ్యులు ఫొటో: 45135 మిల్లీమీటర్ల కొలతతో (ఐసిఎవో తరహపాస్ పోర్ట్ సైజు కలర్ ఫోటోను జతచేయండి. ఇది 200 కె.బి కంటే తక్కువ సైజుండాలి )

**ఉద్యోగి జీవిత భాగస్వామి రాష్ట్ర ప్రభుత్వోద్యోగి/ సర్వీస్ పించను పొందుతున్న వారైతే దరఖాస్తులోని నిర్ణీత ప్రదేశంలో వివరాలను నమోదు చేయాలి

**జనన ధృవీకరణ సర్టిఫికెట్‌: ఐదేళ్ళ లోపు వయసున్న కుటుంబసభ్యులున్నట్లయితే వారి జనన ధృవీకరణ సర్టిఫికెట్లను స్కాన్‌చేయండి.

**కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా అంగవైకల్యం వున్నట్లయితే వికలాంగ ధృవీకరణ పత్రాన్ని స్కాన్‌చేయండి.

**మీసేవ కేంద్రాల్లోడైరెక్టర్, ఇఎష్ డి, ఐటి & సి పేర్కొన్న ప్రకారం రు .25కి మించకుండా రుసుము చెల్లించి ఈ తాత్కాలిక ఆరోగ్యకార్డులను పొందవచ్చు